రాయికల్
అట్టహాసంగా అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమం

viswatelangana.com
June 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అమృత్ 2.0 వందరోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ అమృత్ 2.0 ద్వారా పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, పట్టణ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటి, మెప్మా డీఎంసీ సునీత, టీఎంసీ శరణ్య, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



