రాయికల్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

viswatelangana.com

September 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణములో పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, సంఘ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, సామల్ల సతీష్, కుల బాంధవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు చిత్తశుద్ధితో కృషి చేసి మూడు తరాలకు వారధిగా ఉన్న అలు పెరుగని పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని. బాపూజీ తెలంగాణ ప్రజానీకానికి చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మామిడాల లక్ష్మీనారాయణ, మ్యాకల కాంతారావు, ఆడేపు రాజీవ్, మ్యాకల రమేష్, కడకుంట్ల జగదీశ్వర్, అనుమల్ల చంద్రతేజ, దాసరి రాజు, మామిడాల కళ్యాణ్ , మచ్చ మహేష్, తుమ్మ రాజేశం, దాసరి గంగాధర్, గాజంగి అశోక్, గోపాల్ జి, జక్కుల చంద్రశేఖర్, మాచర్ల మారుతి, కట్టెకోల రఘు, లక్ష్మీనారాయణ, అష్టమవాడ పెద్దలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button