అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో ఫిబ్రవరి 04 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 5వ అంగన్వాడి సెంటర్ లో ఐ.సి.డి.ఎస్. జగిత్యాల ప్రాజెక్ట్ సీడీపీవో మమత ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా కోట్లాదిమందినీ క్యాన్సర్ బలి తీసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగి మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్ ను గుర్తించగా.. 97 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా, సుమారు 9.1 లక్షల మంది మరణించారు. 2021 నాటికి భారత్ లో 2.67 కోట్ల మంది క్యాన్సర్ బాధితులు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 2.98 కోట్లకు చేరుకుంటుందని ఐ సి ఎం ఆర్ అంచన వేసింది, క్యాన్సర్ సోకిన 9 మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒక్కరు మరణిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న ‘ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’ గా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ అంటే మాన శరీరంలో కనవిభజనలు సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. ఒక్కోసారి కొన్ని కారణాలతో ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరచుటను క్యాన్సర్ అంటారు. ఎక్కువగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు వల్ల 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. ఆల్కహాల్ వల్ల పేగు, రొమ్ము, నోరు, స్వర పేటిక, అన్నవాయిక, కాలేయం తో పాటు మరో ఆరు రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. అధిక బరువు కారణంగా గర్భాశ యం పాంక్రియాటిక్ సహా 12 రకాల క్యాన్సర్ ల ముప్పు పొంచి ఉన్నది. అందువల్ల మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఎస్ రాజేశ్వరి, ఏఎన్ఎం సరిత, ఆశ వర్కర్ జలజ మరియు పాఠశాల ఉపాధ్యాయులు సిలివేరి రమేష్ మరియు పిల్లలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.



