
viswatelangana.com
September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
పిల్లలు లోపపోషణకు గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐసీడీఎస్ సీడిపివో మణెమ్మ, సూపర్ వైజర్ ప్రేమలతలు అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని గోవిందగిరి నగర్ అంగన్వాడీ కేంద్రం పరిధిలో పోషణ మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ సీడిపివో సూపర్ వైజర్ లు బరువు తక్కువ పిల్లల తల్లులకు (సామ్ , మామ్) గురించి గృహ సందర్శన ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పిల్లలు లోపపోషణకు గురి కాకుండా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి నెల బరువు అంగనివాడి కేంద్రంలో తెలుసుకొని సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సుజాత పాల్గొన్నారు.



