అధికారికంగా గుర్తింపు కల్పించేలా శిక్షణ అందించాలి

viswatelangana.com
వైద్యులకు అనుబంధంగా వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారికంగా ప్రభుత్వం శిక్షణ అందించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండల గ్రామీణ వైద్యుల నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ అందించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం పల్లెల్లో రోగులకు అవగాహన కల్పిస్తూ గ్రామీణ వైద్యులు దిశా నిర్దేశం చేయడంతో సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల సేవలు వెలకట్టలేవని వారి త్యాగాలకు గుర్తింపుగా ఆర్ఎంపి పి.ఎం.పి లకు ఆటకం కలగకుండా ప్రభుత్వం పునరాలోచన చేసి శిక్షణ అందించి సర్టిఫికెట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, నాయకులు కొయ్యేడి మహిపాల్, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య, ఏద్దండి దివాకర్, తలారి రాజేష్, పొన్నం శ్రీకాంత్, షాకీర్, ఆంజనేయులు, మురళి, రాజేష్, గుమ్మడి సంతోష్, అశోక్, ఆర్.ఎం.పి పిఎంపీల మండల అధ్యక్షులుగా చెలిమెల మల్లేష్, ప్రధాన కార్యదర్శి రొట్టె శ్రీధర్, కోశాధికారి యం. డి. సామీర్ తదితరులు పాల్గొన్నారు.



