అనాధాశ్రమానికి చేయూతగా విశ్వశాంతి చిన్నారులు
viswatelangana.com
ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం మళ్ళీ మనకు తిరిగి చేరుతుందని అనుకున్నారేమో స్కూలు పిల్లలెందరో కలిసి డబ్బులు జమచేసి తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం పాఠశాల ద్వారా అందించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో నాలుగవ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు 20000 /- రూపాయలను గోదావరిఖని ప్రాంతం లోని ఎండి హెచ్డబ్ల్యూఎస్ ఆర్ఫాన్స్ హోమ్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే అనాధ ఆశ్రమానికి విరాళంగా అందించారు. ఇట్టి విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారూ, సంజన, ఇందుజా రజిత, శృతి, శ్రీజ, మనీషా, స్రవంతి, అపర్ణ ప్రత్యూష, మమత, సహస్ర రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



