రాయికల్

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

viswatelangana.com

March 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో పూర్తిగా కాలిపోయిన యువకుని మృతదేహం కలకలం సృష్టిస్తోంది నిన్న మిస్సింగ్ అయిన యువకుడు నేడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు ఇది హత్య నా ఆత్మహత్యానా అని ప్రజలలో అనుమానాలు రేకేతీస్తోంది ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన భూస కళ్యాణ్ రామ్ నిన్న మిస్సింగ్ అయ్యాడు దీనిపై యువకుని కుటుంబ సభ్యులు గురువారం రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా అన్యుహంగా శుక్రవారం ఉదయం ఇటిక్యాల రాయికల్ గ్రామాల మధ్య గల కోళ్ల ఫారం లో కళ్యాణ్ రామ్ పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడు సమాచారం అందుకున్న రాయికల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు కానీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంటి నుంచి అదృష్టమైన యువకుడు ఎందుకు వెళ్ళాడు పాడుబడిన కోళ్ల ఫామ్ కు ఎందుకు వెళ్లాడు తనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి తగలబెట్టారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఈ అనుమానాస్పద మృతి పై పోలీసులు స్థానికులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు

Related Articles

Back to top button