రాయికల్
అన్నదానం

viswatelangana.com
September 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత ఆశ్రమంలో పితృపక్షాల సందర్భంగా రాయికల్ మండల మాజీ ఎంపీపీ ఉత్కం రాధా సాయ గౌడ్ లు తమ పెద్దల జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాధా సాయగౌడ్ మాట్లాడుతూ తమ తల్లి తండ్రితో సమానమైన వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి పెగ్గర్ల రాజేశ్వర్ గౌడ్ గాడిపెల్లి అంజాగౌడ్ హరిప్రియ దంపతులు కొల్లూరు వేణు అనుపురం లింబాద్రిగౌడ్ తదితరులు పాల్గొన్నారు



