రాయికల్
ఉత్తమ సేవ పురస్కారం

viswatelangana.com
June 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణానికి చెందిన మహమ్మద్ ముస్తాఖ్ హైమద్ మున్ను సోషల్ వర్కర్, బ్లడ్ మొటివేటర్ తను చేస్తున్న సేవ కార్యక్రమలను గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారు అతనిని ఘనంగా సన్మానించి ప్రశంశ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్ రావు, డి ఎం హెచ్ ఓ సమీఉద్దీన్, డిప్యూటి డి ఎం హెచ్ ఓ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్, పోషక ఆహార నిపుణులు రిచా శ్రీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ, రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మంచాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



