కొడిమ్యాల

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

viswatelangana.com

June 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని మంగళవారం కొడిమ్యాల మండల కేంద్రంలో పర్యటించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలిపారు అప్పారావుపేట గ్రామానికి చెందిన పొన్నం హన్మంతు, నాచుపల్లి గ్రామానికి చెందిన బొడ్డేలి నాయకయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించగా రైతు భీమా పధకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే ప్రమాద భీమా సహాయం 5,00,000/- రూపాయల ప్రొసీడింగ్ పేపర్లను అందించారు, అలాగే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లకు సంబందించిన 22,02,552/- విలువగల 22 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button