కథలాపూర్

విద్యార్థులకు బహుమతుల వితరణ

viswatelangana.com

October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన ప్రాథమిక పాఠశాలలో పిల్లల్లో హాజరు శాతం పెంచడాని కొరకు ప్రతి నెలలో 100% పాఠశాల కు హాజరైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న నేపధ్యంలో సెప్టెంబర్ నెలలో 100% పాఠశాలకు హాజరైన 32 మంది విద్యార్థులకు గుండేటి శశి బహుమతులు అందజేశారు. బహుమతులు అందించిన గుండేటి శశి ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి రవి, ఉపాధ్యాయులు సాయిరెడ్డి, రమేష్, శివ కృష్ణ, ప్రశాంత్, శ్రావణి, వర్ణ, గ్రామస్తులు సురేష్, నరేష్, నేహా, నవ్య, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button