కోరుట్ల

అబ్దుల్ కలాం ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థుల విజయకేతానం

viswatelangana.com

March 19th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

సిద్ధార్థ విద్యా సంస్థలు విద్యార్థుల విజయానికి పునాదులు ఇందులో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభకు కొదువలేదు ఏ ప్రతిభ పరీక్ష ఐనా సిద్ధార్థ పాఠశాల విద్యార్థులే రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి ర్యాంకులు మొన్న జరిగిన జాతీయ శ్రీనివాస రామానుజ ఒలింపియాడ్ ప్రతిభ పరీక్షలో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించిన అల్లే సాత్విక మరియు జిల్లా స్థాయి మొదటి ర్యాంక్ మిట్టపల్లి మనుశ్రీ జిల్లా స్థాయి రెండో ర్యాంక్ అంకం వర్ధిని ఎనిమిది మంది విద్యార్థులకు జిల్లా స్థాయి ర్యాంకులు వర్ష, హర్షిత, వర్షిత్, జ్యోష్న, చరణ్య, ప్రణతి మరియు లాస్య వీరందరి విజయం మా సిద్ధార్థ విద్యా సంస్థల పేరు ప్రాక్యాతాలను రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్లయి అనడంలో మేము చాలా గర్వ పడుతున్నాము.పాఠశాల కరెస్పాండంట్ ఎక్కల్ దేవి బాలాజీ దామోదర్ గారు మాట్లాడుతూ ఇంతటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన మా విద్యార్థులందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు మున్ముందు మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ విద్యా సంస్థకు మరియు మీ తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మరియు ప్రతి విద్యార్ధి వీరిని స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రమ కమలదర్ గారు,గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ వినోద నాగరాజు, జగదీశ్వర్, శేఖర్ గారు విద్యార్థులను అభినందించారు.

Related Articles

Back to top button