viswatelangana.com
Date of Publish : 08 October 2024, 1:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల పట్టణం గాంధీ రోడ్ లో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రంజిత్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, రంజిత్ గుప్తా, ఎంబేరి సత్యనారాయణ, అల్లాడి శ్రీనివాస్, తెడ్డు విజయ్, తునికి సాయి, నేతి శ్రీనివాస్, రాజ కిషన్, జాగిలం భాస్కర్, మ్యాదరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type