జగిత్యాల

అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ డే

viswatelangana.com

October 21st, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ డే ను పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎండి సమీయుద్దీన్ అధ్యక్షతన సిబ్బందికి అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం తినే ఆహారంలో ప్రతిరోజు 5 గ్రాముల అయోడైసిడ్ సాల్ట్ ఉండేటట్లు చూసుకోవాలని, లేనిపక్షంలో వాటి వలన వచ్చే దుష్ప్రభావాలకు లోను కావాల్సి ఉంటుందని సూచించారు. అయోడిన్ లోపం వలన గర్భస్రావం, మృత శిశు జననం, అసంపూర్ణ పిండ మెదడు అభివృద్ధి, తక్కువ మానసిక మరియు శారీరక పెరుగుదల, గాయిటర్, తక్కువ ప్రజ్ఞ లబ్ధి స్థాయి అనగా బుద్ధి మాంధ్ద్యత, మరుగుజ్జు తనం, తక్కువ అభ్యసన సామర్ధ్యాలు వస్తాయని అందుకే తప్పనిసరిగా ఆహారంలో అయోడిన్ వాడవలనని సూచించారు. అయోడిన్ థైరాయిడ్ గ్రంథిలో కీలకంగా వ్యవహరించి టి3, టి4 లు మరియు థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ లను స్రవించడంలో తోడ్పాటు అందిస్తాయి. దీని యొక్క లోపం వలన హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజంవస్తుంది. కావున ప్రజలందరూ అవగాహన పెంచుకొని, అయోడిన్ లోపం వలన కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎండి సమీయుద్దీన్, డిప్యూటీ డిఎమ్ హెచ్ హో డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జైపాల్ రెడ్డి మరియు అర్బన్ హెల్త్ సెంటర్లలోని వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button