కోరుట్ల

అయోధ్య బాల రాముని దర్శన యాత్ర కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు

viswatelangana.com

February 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రతినిధి:అయోధ్య బాల రాముని దర్శన యాత్ర కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ 13వ తేదీ మధ్యాహ్నం అయోధ్యలో నిర్మించిన భవ్యమైన దివ్యమైనరామ మందిర నిర్మాణంతోపాటు అందులో ప్రతిష్టించిన బాల రాముని విగ్రహ దర్శనానికి వెళ్లే భారతీయ జనతా పార్టీ భక్తులందరికీ హైదరాబాదు నుండి రైల్లో పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని తలంచి మన పార్లమెంట్ సభ్యులు మాట తప్పని మడిమె తిప్పని పసిపిల్లల ప్రాణపదాత ధర్మపురి అరవింద్ రైల్వే అధికారులతో మాట్లాడి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ భక్తులందరికీ నిజామాబాద్ నుండి రైలు సౌకర్యం కల్పించి భవ్యమైన దివ్యమైన రామ మందిరం దర్శించుకోవడానికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన మన పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇంత మంచి సౌకర్యాన్ని కలగజేసిన మన పార్లమెంటు సభ్యులకు మనమందరం కృతజ్ఞులము ఆని అన్నారు

Related Articles

Back to top button