జగిత్యాల

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

viswatelangana.com

December 2nd, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

ప్రపంచ పర్యవరణ పరిక్షణ వరోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం జగిత్యాల్ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు అడిషనల్ కలెక్టర్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ బిఎస్ లత గౌతంరెడ్డి లోకల్ బాడీ మరియు జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఆర్డీవోలు జిల్లా అధికారుల అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ వారోత్సవం గురించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మన పర్యావరణం, పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన ప్రపంచం అవసరమని అర్థం చేసుకోవడం సకల జీవరాశుల శ్రేయస్సు కోసం, అవసరమైన చర్యలను అనుసరిస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిసస్తామని, పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తూ, నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగిస్తూ, ఎనర్జీ ఎఫిషియెన్సీ ఉప్త్పత్తులను వాడటం ద్వారా విద్యుత్ ని ఆదా చేస్తు, నడక, సైక్లింగ్, ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇస్తామని, ఇల్లు, తోటలలో హానికరమైన రసాయనాలను ఉపయోగించమని, పరిశుభ్రత కార్యక్రమాలు, చెట్లు నాటడం చర్యల ద్వారా పర్యావరణ ప్రచారాల్లో పాల్గొంటామని ప్రతిజ్ఞా చేయడం జరిగింది. ఇదే విదంగా పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ కార్యలల్లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. డా. అర్చన యన్.సి.డి. ప్రోగ్రాం అధికారి గొల్లపల్లి రోడ్ లో ఉన్న క్రషర్ పాయింట్ లో పనిచేసే వారికి గాలి కాలుష్యం గూర్చి అవగాహణ కల్పించి, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది.

Related Articles

Back to top button