మెట్ పల్లి

అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుడి అన్నదానం

viswatelangana.com

December 8th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశాడు ఓ ముస్లిం సోదరుడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేసి అందరికి ఆదర్శంగా నిలించాడు మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా. మెట్ పల్లి పట్టణంలోని టీపీసీసీ డెలికేట్ మెంబర్ కల్వకుంట్ల సుజితరావు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ తో పాటు పలువురు అయ్యప్ప స్వాములకు, భక్తులకు కులమతాలకు అతీతంగా అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఖుతుబొద్దీన్ పాషా దగ్గరుండి స్వాములకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలనుకుంటున్నానని, ఆ కోరిక నేడు నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మతాలను పక్కన పెట్టి మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు అయ్యప్ప స్వాములు. మతసమరస్యానికి ప్రతీకగా శబరిమలై వెళ్లే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు.. ఏరిమెలిలో ఉన్న వావరు స్వామిని దర్శించుకున్న తరువాతే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని ఖుతుబొద్దీన్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, బైండ్ల శ్రీకాంత్, కల్లెడ గంగాధర్ సాగర్ అమ్ముల పవన్ భరత్ మహబూబ్ అన్వర్ శీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button