కోరుట్ల

అరుణోదయ లో క్యాంపస్ డ్రైవ్ విజయవంతం

viswatelangana.com

April 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల లో జరిగిన క్యాంపస్ డ్రైవ్ లో 92 మంది విద్యార్థులు హాజరు అవ్వగా 30 మంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారని , సోమవారం రోజున వాళ్లకి హైదరాబాదులో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ జరుగుతుందని ఆ తర్వాత వాళ్లకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని డ్రైవ్ నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పని చేస్తేనే ఉన్నత స్థానాలకు వెళ్తారని తెలియజేశారు. ఇంటర్వ్యూ హెచ్ఆర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ లను అభినందించారు. ప్రతి ఒక్క కళాశాల వారు తమ కళాశాల విద్యార్థులకు మాత్రమే ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు. శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు పట్టణ పరిసర ప్రాంతాల వారందరికీ నిర్వహించడం చాలా అభినందించ వలసిన అవసరము ఉందని చెప్పారు. ఇప్పటివరకు శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలలో దాదాపు 12 సార్లు ప్లేస్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది, 400 నుండి 450 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాము అని కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, వినయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button