కోరుట్ల
అలరించిన సిగ్నేచర్ డే వేడుకలు

viswatelangana.com
May 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల కోరుట్లలో 2022- 25 బ్యాచ్ బీకాం మరియు బి బి ఏ విద్యార్థులు సిగ్నేచర్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాలలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపి వారి యొక్క స్నేహం కలకాలం వర్ధిల్లాలని, కష్టాల్లో మరియు సుఖాల్లో కూడా ఒకరికొకరు అండగా నిలవాలని ఒకరి సంతకాలని ఒకరు తీసుకున్నారు.



