కోరుట్ల
మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా బి.మోహన్

viswatelangana.com
August 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా భీమనాతి మోహన్ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. బి. మోహన్ ఇంతకు ముందు కొడిమ్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా గత ఐదు సంవత్సరాల నుండి విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇటిక్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ అలాగే జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మోహన్ మాట్లాడుతూ… విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఉన్నత ఫలితాల సాధన లక్ష్యంగా ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తానని తెలిపారు.



