viswatelangana.com
Date of Publish : 27 September 2024, 3:53 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
featured

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమన్ మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర ఎంతో గొప్పదని తెలియ చేశారు. ఈ కార్య క్రమంలో ఎన్ ఎస్ ఎస్ పివో గంగాప్రసాద్, అధ్యాపకులు నటరాజన్, హబీబ్, శ్రీనివాస్ ఇమ్రాన్ ఖాన్, మోయిజోద్దిన్, ఫాతిమా, డింగరి ప్రశాంత్, సుబ్రమణ్యం స్వరూప,నవీన, అమీనా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type