విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో బుధవారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్సై సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే మోసపూరితమైన ప్రకటనల పట్ల అప్రమత్తం ఉండాలని, ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలపై 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్ కానిస్టేబుల్ సౌజన్య మానవ అక్రమ రవాణాపై, కానిస్టేబుల్ రాజేందర్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ల గురించి, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం కళాకారులు రమేష్, కమల్ పలు సామాజిక చైతన్య గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి. తిరుపతి, పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు



