రాయికల్
విద్యార్థులకు అభినందన

viswatelangana.com
May 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం పదవ తరగతి లో పాస్ అయిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అధికంగా 549 మార్కులు సాధించిన పారిపెల్లి సుప్రజ, స్ఫూర్తి, నేహా లతో పాటు విద్యార్థులందరికీ పుష్పగుచ్చము ఇచ్చి, ఆన్లైన్లో మెమోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు వేముల మధు, కల్వకోట కార్తిక్, సిద్దె గంగారాజం, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



