రాయికల్
ఆదర్శ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

viswatelangana.com
March 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న పదిమంది మహిళా ఉపాధ్యాయులకు తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండలశాఖ తరపున మంగళవారం ఘనంగా సన్మానించారు. భావిభారతపౌరులను తీర్చి దిద్దే గురుతర బాధ్యత వహిస్తున్న మహిళలను పలువురు కొనియాడారు . నారీ శక్తి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్ పిజిటి శ్రీనివాస్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్ సదాశివ్ తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి భాగ్యలక్ష్మి ప్రధానకార్యదర్శి యస్ గంగాధర్ నాయకులు యం.శాంతా కుమారి వి.సంపత్ కుమార్ ఉపాధ్యాయులు పి.జ్యోతి ఉషారాణి రజిత ప్రదీప తదితరులు పాల్గొన్నారు



