ఆదర్శ యువసేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు సన్మానం

viswatelangana.com
గురువారం రోజున కోరుట్ల పట్టణంలోని ఆదర్శ యువసేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2024 లో జగిత్యాల జిల్లాలో పలు విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అజ్మత్ ఆలీ మాట్లాడుతూ డాక్టర్ దార సుమన్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు, మామిడిపల్లి రామకృష్ణ ఎస్సే సోషల్ సైన్స్ ఎంపిక కావడం ఎంతో గర్వకారణం అని, వీరు ఎంతో శ్రద్ధాసక్తులతో చదివి జగిత్యాల జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు వీరిని ప్రశంసించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంఏ ముసవీర్ మాట్లాడుతూ విద్య ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందని అదేవిధంగా కృషి చేసిన ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోపారపు రమేష్ జూనియర్ లెక్చరర్ లైబ్రేరియన్ విభాగం మాట్లాడుతూ వీరు నేటి యువతకు ఆదర్శంగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే బయాలజీ సైన్స్ టీచర్ మిట్టపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని పేర్కొన్నారు. చెన్న రాజశేఖర్ ఎస్జిటి మాట్లాడుతూ మిత్రులు ఉద్యోగం సంపాదించడం చాలా సంతోషకరమని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సన్మాన గ్రహీతలు డాక్టర్ దార సుమన్ మాట్లాడుతూ తన కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడేటువంటి ఉన్నతమైన విలువలతో స్థాపించబడిన ఆదర్శ యువసేవ అసోసియేషన్ . తాను విజయం సాధించడంలో కృషి చేసిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇష్టంతో కష్టపడితే విజయం సాధించడం సులువుతుందన్నారు. ఇంతటితో ఆగిపోకుండా, మరింత ముందుకెళ్లాల కష్టపడుతూ భవిష్యత్తులో డిగ్రీ లెక్చరర్, యూనివర్సిటీ స్థాయి ఉద్యోగాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మరో సన్మాన గ్రహీత మామిడిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో శ్రమించిన ఉద్యోగం చాలా సార్లు దగ్గరికి వచ్చి చేజారిపోయినప్పుడు మొక్కవోని దీక్షతో పొరడుతూ, ఈసారి గట్టి ప్రయత్నం చేసి జిల్లాలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి 2024 డీఎస్సీలో తనకు విజయం సాధించడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల సుమన్ సయ్యద్ మజార్ తదితరులు పాల్గొన్నారు.



