ఆది దేవుని ప్రతినిత్యం పూజించాలి…..

viswatelangana.com
వినాయక నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో గణనాథుని మండపాలని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం పూజలు చేస్తున్నామని గ్రామ మాజి సర్పంచ్ వన తడుపుల అంజయ్య తెలిపారు. వినాయకుని పూజ, దేవిదేవతల కన్నా ముందే చేయవలసిన పూజ అని, పార్వతి పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణుల అనుగ్రహంతో ఆదిదేవునికి మొదటి పూజ చేయాలన్నారు. ఈ గణనాథునికి పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అని తేడా లేకుండా… మంచి వ్యవసాయం, మంచి విద్య, ఆరోగ్యం, వ్యాపారం అన్నింటిలోనూ ఆగణనాథుని ఆశీస్సులు ఉండాలని, కల్లూరు గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నామని అంజయ్య తెలిపారు. ఈ గణనాథుని పూజా కార్యక్రమంలో వి మహేందర్, రాజు, అజయ్, మనోజ్, కృష్ణ, శేఖర్, పవన్ అనిల్, నవీన్ విశాల్, కనకయ్య, సంపత్, రమేష్, వనిత, సునీత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



