viswatelangana.com
Date of Publish : 21 April 2025, 1:11 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆది శ్రీనివాస్ ను సన్మానించిన జువ్వాడి కృష్ణారావు

వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరసత్వం పై చేసిన న్యాయపోరాటంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆది శ్రీనివాస్ కు అనుకూలంగా తీర్పునివ్వడం చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు అని పేర్కొన్న సంగతి విధితమె ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాల్సిందిగా అదేవిధంగా న్యాయ ప్రాధికారిక సంస్థకు 5 లక్షల రూపాయలు రమేష్ బాబు చెల్లించాల్సిందిగా గతంలో ఇచ్చిన తీర్పులో దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనగా సోమవారం హైదరాబాద్ లో రమేష్ బాబు న్యాయవాదుల ద్వార ఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు చెల్లించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణ రావు, ఆది శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ భారత పౌరసత్వం లేనప్పటికి చెన్నమనేని రమేష్ బాబు తప్పుడు అఫిడవిట్ సమర్పణ ద్వారా శాసనసభ్యునిగా ఎన్నికై ప్రభుత్వ నుండి జీతభత్యాల రూపంలో తీసుకున్న డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు బొమ్మ శ్రీరాం చక్రవర్తి పాల్గొన్నారు.

Change News Type