కథలాపూర్
ఆపదలో స్పందించే నాయకుడు ఆది

viswatelangana.com
August 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కాంగ్రెస్ పార్టీ కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన నాయకుడు, ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అన్నారు. అర్థరాత్రి ఫోన్ చేసిన స్పందించి సమస్యను పరిష్కరిస్తాడని ఇట్లాంటి నాయకుడు ఉండటం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన మూగ, చెవిటి వ్యాధి తో బాధపడుతున్న అన్విక పాపకు ఒకే ఒక్క రోజులో 5 లక్షల ఎల్ వో సి అందించటం పట్ల తల్లిందండ్రులు ఆనందం వ్యక్తం చేసారని ఇట్లాంటి ప్రజా నాయకులు చాలా అరుదుగా ఉంటారని అనునిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని అన్నారు.



