కథలాపూర్
ఆరు నెలల్లో నాలుగు ఉద్యోగాలు సాధించిన పోసానిపేట యువకుడు

viswatelangana.com
October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన కుందారపు రాజం- లక్ష్మిల దంపతుల కుమారుడు విజయ్‌కు 6 నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ మ్యాథ్స్ ఉద్యోగాలు సాధించి ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌గా ఎంపికయ్యాడు. ఇంత అద్భుత ప్రతిభ కనబర్చిన విజయ్ యువతకు రోల్ మోడల్ అని పలువురు కొనియాడుతున్నారు.



