కోరుట్ల
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
June 24th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్నవారిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. ఏకిన్‌పూర్ గ్రామంలో ఆరోగ్య సమస్యలతో ఉన్న సీనియర్ పత్రిక విలేకర్ గోరుమంతుల నారాయణను ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి మోహన్‌ను కలసి ధైర్యం చెప్పారు. వేంపేటలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చొక్కా గౌడ్‌ను, కోరుట్ల రాంనగర్‌లో గుండె శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి లోనున్న లక్ష్మీ నారాయణను పరామర్శించారు. ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన వేళ సహాయం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



