కోరుట్ల

ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ

viswatelangana.com

March 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ఎండాకాలం నేపథ్యంలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా సిబ్బంది ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీనీ కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు రోజంతా బస్సుల్లో వేడి వాతావరణంలో తిరుగుతుంటారు కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో మజ్జిగ ప్యాకెట్లను అందించడం జరిగిందని డిపో మేనేజర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్డెంట్ లక్ష్మయ్య, అసిస్టెంట్ మెకానికల్ ఫోర్ మెన్ సాదిక్ ఆలీ, ఆఫీసు సూపర్డెంట్ గంగారాం, ఆఫీస్ డిప్యూటీ సూపర్డెంట్ ఫైనాన్స్ బాబు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, అలాగే అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button