ఎంపీ గా గెలుస్తున్నాం- నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి

viswatelangana.com
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలోని ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పార్టీ కోసం తన గెలుపుకు కోసం అహర్నిశలు కృషి చేశారని అందువల్లే గెలువబో తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. లక్షకు పైగా మెజారిటి రానున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతాల కోసం కాకుండా, రాజకీయ లబ్ది కోసం పాకులాడిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగాలు చేసినప్పటికి ఈ ప్రాంత ప్రజలు మత సామరస్యంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత రైతులు కాంగ్రెస్ ను విశ్వసించి తనకు ఓటు వేశారన్నారు. 2015 తర్వాత చక్కెర కార్మగారాన్ని పట్టించుకునేవారు. కరువయ్యారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపించేందుకు కృషి చేస్తుందని రైతులు సమ్మారన్నారు. చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభం చేస్తామనడం వల్ల మాకు విజయావకాశాలు మెరుగ య్యాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చక్కెర కార్మాగారం కొరకు రూ.43 కోట్లు విడుదల చేశామని. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో చతికిల పడడంతో, బీజేపీ గెలుపుకోసం పనిచేశారని పేర్కొన్నారు. ప్రజలు ఓర్పు, సహనంతో ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా భావిస్తు న్నామని తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్త లందరికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, ప్రజలు మాకు అండగా నిలవడం మా బాధ్యతను మరింత పెంచిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెఎన్ వెంకట్, అల్లూరి మహేందర్ రెడ్డి, కాటిపెల్లి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



