కోరుట్ల

డయాలసిస్ యంత్రాలను పరిశీలించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

August 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్ యంత్రాలను, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు గురువారం పరిశీలించారు. ఆసుపత్రి సందర్శనలో భాగంగా యంత్రాలను పరిశీలించి రోగులతో మాట్లాడి.. వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా అవసరమైన మందులు ఇతర వైద్య యంత్రపరికరాలు మంజూరు చేయించే విధంగా తాము కృషి చేస్తామని, కాబట్టి రోగులకు ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయీమ్, ఎంబేరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button