viswatelangana.com
Date of Publish : 03 March 2025, 1:59 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి

దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల గోడ ప్రతిని సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ నవీన్ తో పాటు శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థినిలకు సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ నవీన్ మాట్లాడుతూ ఆర్ధిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ ఆర్థిక వృద్ది సాదించాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్లకు ఎవరూ స్పందించవద్దని, తమ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఏటిఎం కార్డు, పిన్,ఓటిపి నంబర్లు ఎవరితో కూడా చెప్పవద్దని అన్నారు. బ్యాంకు ఖాతా పొదుపు ఆవశ్యకత, సైబర్ నేరాలు, పీఎం ఎస్ బి వై,పీఎం జేజే బి వై,ఏపివై ల గురించి అవగాహన కల్పించారు.శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పదని డబ్బును పొదుపు చేయడంలో మహిళలు ముందుంటారని,ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆర్బీఐ వారిని, సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ నవీన్ ని అభినందించారు.ఈ కార్యక్రమం లో సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ నవీన్, శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Change News Type