కోరుట్ల
అంగరంగ వైభవంగా ఆరట్టు ఉత్సవం…

viswatelangana.com
December 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని స్థానిక శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో ఉన్న కోనేరులో అయ్యప్ప ఉత్సవమూర్తికి శ్రీ పాలెపురాంశర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు మంగళ స్నానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి ఉత్సవమూర్తి రథోత్సవ శోభయాత్ర పట్టణ పురవీధుల్లో గుండా దేవాలయం వరకు సాగింది. శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిర్వహించే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం లో పాల్గొనే దంపతులు తమ పేరు నమోదు చేసుకోగలరని, ఉదయం 7 గంటలకు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వహించబడును అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు.



