రాయికల్
విశ్వశాంతి హై స్కూల్ లో ముందస్తు హోలీ వేడుకలు

viswatelangana.com
March 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి హై స్కూల్లోముందస్తు హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ ఆనందోత్సవాలతో హోలీ రంగులతో వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చ గంగాధర్ గారు హోలీ పండుగ విశిష్ఠతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత విధ్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్ హరీష్ , రంజిత్ , విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.



