రాయికల్
ఆర్మీ జవాన్ కు ఘన స్వాగతం

viswatelangana.com
May 2nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతి పూర్ గ్రామానికి చెందిన నూకల మల్లయ్య భారతీయ ఆర్మీలో 17 సంవత్సరాలు విధులు నిర్వహించి దేశ రక్షణలో తన వంతు భాగస్వామ్యమై తన స్వగ్రామం భూపతి పూర్ కు రాగ ఆయన మిత్రులు మల్లయ్యకు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చా న్ని అందజేసి పూల మాలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మిత్రులు, గ్రామస్తులు మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేని వేణు, ఎంపీటీసీ మహేశ్వరరావు, తుమ్మనపల్లి విజయ్, దేవేందర్ రెడ్డి, జిత్తు, కామని లక్ష్మణ్ , ఏనుగు రాజారెడ్డి, రాంప్రసాద్, బొడ్డుపెల్లి విజయ్, మోతే అంజయ్య, బొల్లె తేజ , మరియు గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.



