తడి పొడి హానికరమైన చెత్త, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన

viswatelangana.com
మున్సిపల్ కమిషనర్ వి. రామకృష్ణ ఆదేశాలతో స్వచ్ఛ – సర్వేక్షన్ 2024-25 లో భాగంగా ప్రజలకి మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత అలాగే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, అలాగే 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వి.రామకృష్ణ మాట్లాడుతూ…మీ ఇంటి నుండి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి, తడి చెత్తను ఆకుపచ్చ రంగు డబ్బాలో, పొడి చెత్తను నీలిరంగు డబ్బాలో వేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వండి. తడి చెత్తను కంపోస్ట్ సెంటర్ కు తరలించి ఎరువుగా తయారు చేయటం జరుగుతుంది. పొడి చెత్తను డి.ఆర్. సి. సి, సెంటర్ కు తరలిస్తామని తెలపడం జరిగింది. కావున పట్టణ ప్రజలు తమ ఇంటి నుండి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి, హానికార చెత్తలుగా వేరు చేయుటకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.



