కథలాపూర్
పలు గ్రామాల్లో బిజెపి ప్రచారం

viswatelangana.com
May 3rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాలైన చింతకుంట, రాజారాం తండా, పెగ్గెర్ల, తాండ్రియాల గంభీర్పూర్, గ్రామాలలో వివిధ పార్టీల నుండి బిజెపి లోకి 50 మంది కార్యకర్తలు బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ రావు ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది. అలాగే అన్ని గ్రామాల్లో గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు మండల కో-ఆర్డినేటర్ భీమారపు సంపత్, కొడిపెల్లి గోపాల్ రెడ్డి, రాచమడుగు వేంకటేశ్వరావు, ఎడ్మల వినోద్ రెడ్డి, బద్రి సత్యం, బండ అంజయ్య, గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



