ఆ గ్రామంలో ఏం జరుగుతుంది

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామంలో ఇటీవల జరిగిన మరణాలకు కారణం అదే అని అంటున్న గ్రామస్తులు. వివరాల్లోకి వెళితే కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామంలో మూడు నెలల నుండి 8 ప్రాణాలు పోవడానికి కారణం ఆ ఎల్లమ్మ తల్లి ఆగ్రహం అంటున్న గ్రామస్తులు. 14 ఏళ్ల వయసు వారి నుండి 60 ఏళ్ల వయసు వరకు ఇప్పటికీ 8 మంది చనిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు ఇందులో యువకులు నలుగురు కావడం ఎవరు ఏ విధంగా చనిపోతున్నారు తెలవక ఇది ఏదో అరిష్టం అని అంటున్న గ్రామస్తులు అసలు ఆ చెట్టు కొట్టి ఉండకుంటే పసి ప్రాణాలు పోయి ఉండేవి కాదు. దీనికి కారణం ఎవరైనా బలవుతున్నది గ్రామస్తులే ఏమి తెలియని యువకులే . ఒక తల్లి రోధిస్తూ 14 ఏళ్ల వయసులోనే నన్ను వదిలి వెళ్లావంటూ రోధిస్తుంటే మరో తల్లి ఒక్క గాని ఒక కొడుకు చేతుకందిన కొడుకు విగిత జీవిగా పడుండడం చూసి రోదించిన తీరు వర్ణనాతీతం. మరో తల్లి చెట్టఅంత కొడుకు గల్ఫ్ దేశాలకు వెళ్లి చెట్టు కింద ఉన్న మమ్మల్ని మేడ నిర్మించి అందులో ఉంచి పెళ్లి చేసుకుందామని వచ్చిన కొడుకు తెల్లవారితే పెళ్లిచూపులు ఉండగా ఇప్పుడే వస్తా అంటూ వెళ్లిన కొడుకు చెట్టుకు గుద్దుకొని కానరాని లోకాలకు వెళ్లాడంటూ ఆ తల్లి రోదన ఎవరు ఆపిన అగని బాధ. మరో తల్లి బాధ తల్లికి కొడుకు కొడుకుకు తల్లి ఇద్దరే బతుకుతున్న వారికి కొడుకు దూరం అవ్వడంతో ఏం చేయాలో ఎలా బతకాలో తెలిసి తెలియని తల్లి రోదన. వీరే కాకుండా మరో నలుగురు చనిపోవడాన్ని చూసి ఇలా ఒకరు ఒకరుగా తనువు చాలిస్తూ పోవడాన్ని చూసిన గ్రామస్తులు ఇంకా గ్రామంలో ఏం జరుగుతుందోనన్న భయందోలనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాలని వీలైనంత తొందరగా ఆ ఎల్లమ్మ తల్లికి నీడ కల్పించాలని ఆ తల్లి ఆగ్రహించకుండా చూడాలని ఎవరు చేసిన తప్పు కానీ మా గ్రామస్తులకు చుట్టుకుందని వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూడాలని ఆ గ్రామస్తులు ఏలమ్మ తల్లిని వేడుకుంటున్నారు



