ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులనుపరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన నిరుపేదల సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇండ్ల పనులను కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సందర్శించి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులను అడిగి ఇంటి కొలతలు. వాటి నాణ్యతలు. పనులు మొదలు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది. అని తెలుసుకొని ఇంటి పనులు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగానే కట్టుతున్నారా లేదా అని తెలుసుకుని. లబ్ధిదారులందరూ నిర్మాణ పనులు తొందరగా చేపట్టి పూర్తిచేసుకుని ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు తీసుకోవాలని సూచించారు, మోడల్ స్కూల్ లో పరిసరాలను. విద్యా బోధన విధానాన్ని మధ్యాహ్న భోజనం గదులను పరిశీలించారు. చెత్త చెదారం ఉండడంతో తక్షణమే శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్. ఎంపీడీవో స్వరూప. ఎమ్మార్వో కిరణ్ కుమార్.ఆర్ ఐ కరుణాకర్. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



