ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల మండలంలోని పైడుమడుగు, జోగిన్ పెళ్లి, చిన్న మెట్ పల్లి గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు గృహ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ నిర్వహించగా ఈ కార్యక్రమనికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వడి కృష్ణారావు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. జువ్వా డి కృష్ణారావు వెంట కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడుఏలేటి మహిపాల్ రెడ్డి, అసిరెడ్డి రాజేశం, కేడీసీసీబీ మాజీ డైరెక్టర్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జనర్ధన్, గంగాధర్, హరీష్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.



