కోరుట్ల
ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభం

viswatelangana.com
October 8th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
సిడీఎంఏ మరియు జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను మునిసిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ కమీషనర్ బట్టు తిరుపతి మరియు మెప్మా ఏ వో శ్రీనివాస్ లు ప్రారంభించినారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ ఇలాంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ జిల్లాలోనే మొదటిది కోరుట్లలో ప్రారబించడం జరిగినదని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమములో గౌరవ కౌన్సిలర్స్, నాయకులు, ప్రజ ప్రతినిధులు, ఆర్పీ లు, మెప్మా సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు



