కథలాపూర్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆది మల్లన్న గుడి వద్ద నంది విగ్రహం ఏర్పాటు

viswatelangana.com
March 17th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి గుడి వద్ద నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది. గత సంవత్సరం మల్లన్న స్వామి ఆశీర్వాదానికి వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని గ్రామ ప్రజలు గుడి ముందు నంది విగ్రహం కావాలని అడగగా తాను చేయిస్తానని గ్రామ ప్రజలకు మాట ఇచ్చి ఒక సంవత్సరంలోగా ఆ మాటను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిలబెట్టుకున్నారు. ప్రజలు, గ్రామస్తులు నంది విగ్రహం విషయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట నిలబెట్టుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.



