కొడిమ్యాల

డబ్బు తిమ్మయ్య పల్లెలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం

viswatelangana.com

June 12th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బు తిమ్మాయపల్లి అంగన్వాడీ కేంద్రంలో మల్యాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రాజెక్టు ఏసీడీపీఓ అరవింద. కిచెన్ గార్డెన్ కు సంబంధించి మొక్కలు నాటడం జరిగింది తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ కిచెన్ గార్డెన్ లో ప్రతి ఇంటిలో కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవడం వల్ల తాజాగా పోషక విలువలు కలిగిన ఆహారము తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ తల్లులు కూడా ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ పెట్టుకోవాలని సూచించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో లభించే పోషకాహారం లో కూడా ఆకు కూరలు కూరగాయలు ఉండాలంటే ప్రతి అంగన్వాడీ సెంటర్లో కిచెన్ గార్డెన్ ఉండాలని, ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ ప్రకారంగా జరిపించాలంటే లెర్నింగ్ కార్నర్స్ పిల్లల మేధావికాసానికి సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపయోగపడతాయని ప్రీస్కూల్ మెటీరియల్ ద్వారా విద్యను నేర్పిస్తే పిల్లలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కొడిమ్యాల సెక్టార్ సూపర్వైజర్ ఉమా, అంగన్వాడి టీచర్ మౌనిక, హెల్పర్ రామక్క, తల్లులు పిల్లలు హాజరు కావడం జరిగింది తెలిపారు

Related Articles

Back to top button