కథలాపూర్
ఇప్పపెల్లిలో గ్రామస్తుల ఆందోళన

viswatelangana.com
September 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామస్తులు అటవీ భూమి విషయంలో వివాదం తలెత్తింది. తమ గ్రామానికి సంబంధించిన భూమి విషయంలో అటవీశాఖ అధికారులు అన్యాయం చేశారని వారు మంగళవారం ఆందోళన చేపట్టారు. వేరే ఎవరో అటవీ శాఖ భూమి చదును చేస్తే దానికి సంబంధం లేని కొందరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం దారుణం అని గ్రామస్తులు మండిపడ్డారు. కానీ అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతోనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెట్ పల్లి డిఎస్పీ ఉమా మహేశ్వరరావు ఇప్పపెల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు సముదాయించారు.



