కోరుట్ల
రక్త దానం ప్రాణదానం కోరుట్ల సేవాదల్

viswatelangana.com
March 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని శివసాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం అవ్వగా కోరుట్ల సేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజు ద్వారా విషయం తెలుసుకున్న గెల్లె శ్రీనివాస్ మరియు షేర్ అనీల్ లు తమ రక్తాన్ని దానం చేశారు. అదేవిధంగా పట్టణంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాచర్ల మమతకి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం అని తెలుపగా విషయం తెలుసుకున్న దిశ పేపర్ రిపోర్టర్ హైమద్ గారి కుమారుడు మహమ్మద్ సోహైల్,నడిమట్ల జగదీష్ లు తమ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారిని హాస్పిటల్ సిబ్బంది మరియు రోగి బంధువులు తదితరులు అభినందించారు.



