బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల పట్టణ 16 వ వార్డు రతాల పంపుకు చెందిన కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు సదుల వినయ్ ఆత్మహత్య చేసుకొని మరణించగా భౌతిక దేహానికి నివాళ్లు అర్పించి, సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అనంతరం కోరుట్ల పట్టణ 30వ వార్డు బాలాజీ రోడ్డుకు చెందిన చిలుముల అరుణ ఇటీవల హైదరాబాద్ లో విద్యుత్ షాక్ తో మరణించగా భౌతిక కాయానికి నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, వీరి వెంట కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, అన్వర్, గంధం గంగాధర్ నాయకులు బలిజ రాజిరెడ్డి, దాసరి రాజశేఖర్, చిట్యాల లక్ష్మీనారాయణ, కడకుంట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



