కోరుట్ల
ఉత్తమ లెక్చరర్ ప్రసంశ పత్రం అందుకున్న జూనియర్ లెక్చరర్

viswatelangana.com
January 26th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం రోజు జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ చేతుల మీదగా కోరుట్ల జూనియర్ కళాశాలకు చెందిన హిందీ జూనియర్ లెక్చరర్ డాక్టర్. ఎండి. ఇమ్రాన్ ఖాన్ ఉత్తమ లెక్చరర్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈయన గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల, రాయికల్ కళాశాల యందు హిందీ లెక్చరరుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పలువురు పేద విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించి ప్రోత్సహించారు. సందర్భంగా కోరుట్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి. గౌస్ రెహ్మాన్, తోటి అధ్యాపకులు, విద్యార్థులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు



