మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, అలాగే మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురుకుల పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు… ఇందులో భాగంగా గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్, టాయిలెట్లకు డోర్ లను, మెస్ డోర్స్, చిన్న చిన్న మరమ్మతులను చేయించాలని అధికారులకు సూచించారు. డైనింగ్ హాల్ షెడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ అలాగే టీచర్లతో విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. వారి వెంట జగిత్యాల ఆర్డీవో మధుసుధన్, మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ జిల్లా సంక్షేమ అధికారి నరేష్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎల్. సాయిబాబా, డిప్యూటీ తహసీల్దార్, ఎంపిడిఓ, గురుకుల పాఠశాల జిల్లా కో-ఆర్డినేటర్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.



